- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ అధికారంలో వైసీపీ నాయకులపై దాడులు! వివరాలు ఇవే : మాజీ మంత్రి
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది వైసీపీ నాయకులపై దాడులు జరిగాయని మాజీ మంత్రి రోజా ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది వైసీపీ నాయకులపై దాడులు జరిగాయని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. ఈ మేరకు దాడి జరిగిన వైసీపీ నేతల వివరాలతో సోమవారం సంచలన ట్వీట్ చేశారు. ‘అంబటి రాంబాబు ఇంటిపై దాడి, జోగి రమేష్ ఇంటిపై దాడి, వల్లభనేని వంశీ ఇంటిపై దాడి, కొడాలి నాని ఇంటిపై దాడి, పెర్ని నాని ఇంటిపై దాడి, ముద్రగడ ఇంటిపై దాడి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి, కామిరెడ్డి నాని ఇంటిపై దాడి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి, అబ్బయ చౌదరి ఇంటిపై దాడి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి, హిందూపూర్ వైసీపీ ఆఫీస్ పై దాడి, దాడిశెట్టి రాజాపై దాడి, ఉప్పల హారిక, ఉప్పల రాముపై దాడి, దేవినేని అవినాష్ పై దాడి, చిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి, మార్గాని భరత్ ఆఫీస్ పై దాడి, విడదల రజినిపై దాడి, నా పై ఆర్పీని పెట్టి బూతుల దాడి, నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేశారు’ అంటూ పేర్కొన్నారు.
పత్రికలపై దాడి..
అలాగే, ‘పత్రికలపై దాడి, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు, సాక్షీ ఆఫీసులపై దాడి చేశారు’ అంటూ ఆరోపించారు. చంద్రబాబు గారు ఇదేనా మీరు అంటున్న "రూల్ ఆఫ్ లా" ఈ రాష్ట్రంలో? అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణి ఎక్స్ వేదికగా నిలదీశారు.






