తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-25 09:52:27  IST  )

తరలివస్తున్న భక్త జనులు. ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారిన తిరువీధులు.

తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) రథ సప్తమి (Ratha Saptami) వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మలయ్యప్ప స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్త జనుల మధ్య స్వామివారు రాజసంగా ఊరేగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఊరేగింపులో భాగంగా ఏడు విభిన్న వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రథ సప్తమి వేడుకల నేపథ్యంలో ఆలయ మహాద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు నానావిధ పుష్పపత్రాలతో అలంకరణ చేశారు. అందుకు సుమారు పది టన్నుల పువ్వులను వినియోగించినట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.

అంతేకాకుండా తిరువీధుల్లో ఊరేగింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజాము 5.30 గంటలకు మలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహన మండపానికి చేరుకున్నారని.. అక్కడ విశేష సమర్పణ అనంతరం సూర్యోదయానికి ముందే సర్కారు హారతతితో వాహనసేవ ప్రారంభమైందని వెల్లడించారు. ఉప బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ వేడుకల్లో భాగంగా ఒకే రోజు వ్యవధిలో ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతారని అధికారులు వివరించారు. సూర్యప్రభ వాహన సేవతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయని అధికారులు తెలియజేశారు.

సర్వదర్శనానికి 20 గంటల సమయం

స్వామివారి సర్వదర్శనం టోకెన్లు (SSD Tokens) లేకుండా దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ ఉందని, కాంపార్ట్మెంట్లు నిండిపోయాయని పేర్కొన్నారు. శనివారం నాడు స్వామివారిని 76,654 మంది దర్శించుకున్నారని తెలిపారు. 34,080 మంది తలనీలాలు సమర్పించారని, 3.81 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అన్నారు.

READ MORE ....

తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూలైన్

Next Story