- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూలైన్
లాంగ్ వీకెండ్, రథసప్తమి కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: లాంగ్ వీకెండ్, రథసప్తమి కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 8-10 గంటల సమయం పడుతుండగా.. రూ.300 టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 4-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (శనివారం) శ్రీవారిని 76,654 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
కాగా.. నేడు రథసప్తమి కావడంతో మలయప్పస్వామివారు ఏడు వాహనాలపై తిరుమల వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమివ్వనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమల వీధుల్లో విహరించగా.. భక్తులు స్వామివారికి హారతులు పట్టారు.
READ MORE ....






