‘క్వాంటం కంప్యూటింగ్‌’తో రాజధాని రూపురేఖలు మారుతాయి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-09 06:20:04  IST  )

ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై అధికారులు పట్టుదలగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.

‘క్వాంటం కంప్యూటింగ్‌’తో రాజధాని రూపురేఖలు మారుతాయి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై అధికారులు పట్టుదలగా పని చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మంత్రులు, కార్యదర్శులతో (Secretaries) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దావోస్‌లో ప్రధానంగా AI (ఏఐ), టెక్నాలజీపై చర్చించామని తెలిపారు. ఎనర్జీ ట్రాన్సిషన్‌పై ప్రధానంగా చర్చలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అమరావతి రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 19 నెలల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని పనులను ఇన్‌చార్జ్ మంత్రులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

రూ.58,654 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశాం..

సూపర్ సిక్స్‌లో భాగంగా ‘తల్లికి వందనం’ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. స్త్రీ శక్తి పథకంతో 4.29 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6,310 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాటిపై ఆడిట్ చేయమని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. దీపం పథకంలో 2 కోట్ల మేర గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసాతో రూ.58,654 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామని అన్నారు. సూపర్ సిక్స్‌లో అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇక రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓ రైతు దగ్గరి నుంచి బలవంతంగా ల్యాండ్ తీసుకుందని, కేవలం హెలీప్యాడ్ కోసం అతడిపై కేసులు పెట్టిందని ఆరోపించారు. ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయని, అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ పాలనలో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు.. పోలవరం, అమరావతి నిధులపైనే స్పెషల్ ఫోకస్!

Next Story