- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు.. పోలవరం, అమరావతి నిధులపైనే స్పెషల్ ఫోకస్!
అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇవాళ సీఎం చంద్రబాబు (CM Chandrababu) హస్తినకు వెళ్లనున్నారు. ఇవళ రాత్రి 7.20కి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.35కు ఢిల్లీ (Delhi) చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోని 1-జన్‌పథ్ నివాసంలో ఆయన బస చేయనున్నారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కీలక శాఖల మంత్రులతో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని రేపు రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు.
ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస (R&R) ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil)తో చర్చించనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయడంపై డిస్కస్ చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు రుణ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ రాకాల గ్రాంట్లపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్, త్వరలో జరగబోయే ఇతర కీలక నిర్ణయాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన సాంకేతిక, ఇతర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లే అవకాశం ఉంది.






