- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. వీటిపైనే చర్చ
నేడు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటారు.

దిశ, వెబ్ డెస్క్: నేడు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటారు. స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై ప్రధానంగా చర్చించున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. అంతే కాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ మరియు పాలనలో ఏఐ టూల్స్ వినియోగం ఇతర సాంకేతికత వినియోగంపై సైతం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారు.
వీటితో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వం కొన్ని సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాలనతో ఏఐ తీసుకువస్తే టెక్నాలజీ ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఏపీలో శాంతిభద్రతల సమస్య కూడా ఉంది. రీసెంట్ గా జరిగిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్, ఇతర పరిణామాల నేపథంలో శాంత్రిభద్రతల సమస్య సైతం ప్రధానంగా మారింది. దీంతో సీఎం అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.






