- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లా | పామూరు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం
ప్రకాశం జిల్లాలోని (Prakasham District) పామూరు వగ్గంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లాలోని (Prakasham District) పామూరు వగ్గంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును (RTC Bus) డీసీఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పామూరు నుంచి కనిగిరికి ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం బయలుదేరింది. బస్సు వగ్గంపల్లికి (Vaggampalli) సమీపించిన సమయంలో అటుగా వస్తున్న డీసీఎం (DCM) బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పాక్షికంగా ధ్వంసం అయ్యింది. డీసీఎం ఢీకొట్టడం వల్ల బస్సులోని సుమారు 10 మందికి గాయలయ్యాయి. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కనిగిరి ఆసుపత్రికి తరలించారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు (RTC Buses) ప్రమాదాలకు గురి కావడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. బస్సు ప్రయాణం చేయాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడుతోంది. రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రైవేట్ బస్సులే (Private Buses) అనుకుంటే.. ప్రభుత్వ బస్సుల తీరు అదే విధంగా ఉండడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రమాద నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ప్రభుత్వాలను కోరుతున్నారు.
Read More..
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది






