అంబటి రాంబాబును జైలుకు తరలించిన పోలీసులు

by Thanuru Gopichand |   (  Updated:2026-02-02 09:17:44  IST  )

గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అంబటి రాంబాబును జైలుకు తరలించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ (YCP) సీనియర్ నాయకులు అంబటి రాంబాబు (Ambati Rambabu) అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెను సంచలనంగా మారింది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు పోలీసులు (Guntur Police) ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనను కోర్టులో ఆదివారం హాజరుపరిచారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాంబాబును పోలీసులు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు, ఎస్కార్ట్ నడుమ ప్రత్యేక వాహనంలో ఆయనను రాజమండ్రికి తరలించారు.

సోమవారం ఉదయం సరిగ్గా 4:05 గంటలకు అంబటి రాంబాబును జైలు ప్రాంగణానికి తీసుకువచ్చారు. జైలు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించిన అధికారులు, అంబటి రాంబాబు కోసం కుటుంబ సభ్యులు పంపిన దుస్తులను సంచులలో పంపేందుకు సైతం అనుమతించలేదు. అంతకుముందు కోర్టులో తన గోడును వెళ్లబోసుకున్న అంబటి, తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఒకప్పటి మంత్రిని ఇలా అత్యంత వేగంగా రాజమండ్రి జైలుకు తరలించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అంబటికి 14 రోజుల రిమాండ్

Next Story