- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా.. పేర్నినాని సవాల్
మంత్రి నారాలోకేష్ కు మాజీ మంత్రి పేర్నినాని సవాల్ విసిరారు. చంద్రబాబు చర్చకు వస్తే జగన్ మోహన్ రెడ్డి వస్తారని అన్నారు. లోకేష్ చర్చకు వస్తే తానే వెళతానని చెప్పారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడుతున్నాడని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారాలోకేష్ కు మాజీ మంత్రి పేర్నినాని సవాల్ విసిరారు. చంద్రబాబు చర్చకు వస్తే జగన్ మోహన్ రెడ్డి వస్తారని అన్నారు. లోకేష్ చర్చకు వస్తే తానే వెళతానని చెప్పారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడుతున్నాడని విమర్శించారు. చీమ చిటుక్కుమన్నా తనవల్లే అంటాడని, సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాలపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారని ఆరోపించారు. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి పదవి కోసమే బోండా ఉమా ముచ్చట పడుతున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. మీరు రాజీనామా చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. ఇది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని వ్యాఖ్యానించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారాలోకేష్ రాజీనామా చేసేంతవరకు పోటారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణకు తాము సిద్ధం అని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు తన భజన పత్రికల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు.






