- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌లోని దక్షిణ ప్రాంతమైన క్యూషూ ద్వీపంలో ఉన్న కుమమోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాంతమైన క్యూషూ ద్వీపంలో ఉన్న కుమమోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం సాయంత్రం ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై దీని 7.1గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ భూ ప్రకంపనల తీవ్రతకు ఇళ్లు, ఆఫీసుల్లోని వస్తువులు విపరీతంగా ఊగిపోయాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ప్రాణాలు దక్కించుకోవడానికి నివాసాలు, భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
భూకంపం ధాటికి సముద్ర మట్టంలో మార్పులు సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు తీరప్రాంత ప్రజలకు 1 మీటరు (3 అడుగులు) ఎత్తున అలలు ఎగసి పడే అవకాశం ఉందంటూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కుమమోటో, నాగసాకి, కాగోషిమా, ఫుకుఓకా సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లను యాక్టివేట్ చేశారు. ప్రస్తుతం సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను సేకరిస్తున్నాయి.






