ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి

by Ratna Kumari |

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి బీజేపీ కార్యకర్త భాగస్వామి కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి
X

దిశ, ఖమ్మం రూరల్ : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి బీజేపీ కార్యకర్త భాగస్వామి కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ మాజీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో 24 గంటల మండల ప్రవాస్ అభియాన్‌లో భాగంగా మంగళవారం ఆయన వివిధ గ్రామాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పనులను సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

వార్డు నంబర్-28లోని పోలింగ్ కేంద్రం నంబర్-128లో నిర్వహించిన సమావేశంలో బూత్ స్థాయి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ముత్తగూడెం, బారుగూడెం, గుదిమల్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. 99 శాతం వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పనులు పూర్తి చేసిన బూత్ స్థాయి అధికారులను అభినందించడంతో పాటు విశేషంగా పనిచేసిన బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలను సన్మానించారు. ఈ సందర్భంగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రాజకీయ కార్యక్రమం కాదని, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవాభావంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శ్యామ్ రాథోడ్, మండల అధ్యక్షుడు సత్తి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి వీరభద్రం, కోటమర్తి సుదర్శన్, షాబాది మమత, సురేష్ నాయక్, బాపునుకా రామయ్య, భానియ నాయక్, పృథ్వీ, ప్రమీల, వీరబాబు, చెరుకుపల్లి వెంకటేష్, చారి, మధు తదితరులు పాల్గొన్నారు.

Next Story