- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సకల సౌకర్యాలు కల్పించాలి : పీవో
ప్రత్యేక అవసరాలు(వికలాంగ)కలిగిన విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు.

దిశ, ఉట్నూర్ : ప్రత్యేక అవసరాలు(వికలాంగ)కలిగిన విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉన్న వికాసం పాఠశాలను మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరందు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న వైకల్యం కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా, వసతి, పోషకాహార సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న రోజువారీ మెనూ వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, ఆహార నాణ్యత ఎలా ఉంది, విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందుతున్నదా అనే అంశాల పై ప్రత్యేకంగా ఆరా తీశారు.
ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించాలని, వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించే విధంగా విద్యను అందించాలని సూచించారు. వైకల్యం కలిగిన విద్యార్థులకు అవసరమైన అంగవైకల్య సహాయక పరికరాల వినియోగం, వాటి పనితీరును పరిశీలించారు. ప్రభుత్వం గిరిజన, దివ్యాంగ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, ప్రత్యేక అవసరాలకు అనుగుణమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేయవచ్చని పీవో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.






