- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్ఫోసిస్ కు భారీ ఫైన్.. నెట్టింట్లో నారాయణమూర్తిపై సెటైర్స్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఐరోపా దేశమైన ఫ్రాన్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన 'ఎంప్లాయీస్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్' వివాదాస్పదమై ఆ కంపెనీకి భారీ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఐరోపా దేశమైన ఫ్రాన్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన 'ఎంప్లాయీస్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్' వివాదాస్పదం కాగా.. ఆ కంపెనీకి ఫ్రాన్స్ భారీ షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని ఫ్రాన్స్ కార్మిక శాఖ తీవ్రంగా పరిగణించి ఇన్ఫోసిస్‌కు దాదాపు రూ.2 కోట్ల జరిమానా విధించడమే కాకుండా, సదరు టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. కాగా, ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిపై నెటిజన్లు పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు. గతంలో యువత వారానికి 72 గంటలు పనిచేయాలని ఆయన ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. "ఫ్రాన్స్ ఏమైనా ఇండియా అనుకున్నారా గొడ్డు చాకిరీ చేయడానికి?", "ఇప్పుడు మీ 72 గంటల పని సిద్ధాంతం ఏమైంది సార్?" అంటూ ఎక్స్, ఇతర సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, పోస్టులతో ఎద్దేవా చేస్తున్నారు.
ఫ్రాన్స్ దేశంలో కఠినమైన కార్మిక చట్టాలు అమలులో ఉన్నాయి. అక్కడి చట్టాల ప్రకారం ఒక ఫుల్-టైమ్ ఉద్యోగి వారానికి కనీసం 35 గంటల నుండి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అంతకుమించి పనిచేస్తే దానిని తప్పనిసరిగా 'ఓవర్‌టైమ్' (Overtime) కింద పరిగణించి అదనపు వేతనం చెల్లించాలి. అయితే ఇన్ఫోసిస్ ప్రవేశపెట్టిన ట్రాకింగ్ సిస్టమ్ స్థానిక కార్మిక హక్కులకు, పని గంటల నిబంధనలకు వ్యతిరేకంగా ఉందనే ఆరోపణలతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఇన్ఫోసిస్ ఫ్రాన్స్ చట్టాలకు లోబడి మాత్రమే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది.






