భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

by Kodari Anjali |

మరికల్ గ్రామంలో రీ సర్వేను మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చెన్నయ్య ఆకస్మికంగా పరిశీలించారు.

భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
X

దిశ, తిమ్మాజీపేట: మండలంలోని మరికల్ గ్రామంలో రీ సర్వేను మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చెన్నయ్య ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రీసర్వ్ కు సంబంధించి పురోగతి ఏ సర్వే జరిగిందని, ఇంకా జరగాల్సిన రీసర్వేపై వివరాలను మండల సర్వేయర్ సాయిబాబాను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలోని చెరువులు కుంటల రీ సర్వే కొనసాగుతుందని సర్వేర్ల కొరత కారణంగా రీ సర్వే ఆలస్యం అవుతుందని లైసెన్స్ సర్వేయర్స్ రీసర్వేకు దూరంగా ఉంటున్నారని ఏమాత్రం పారితోషికం లేకుండా ఎలా రి సర్వేలో పాల్గొనాలని ప్రశ్నిస్తున్నారని విషయాలను ఆయన జాయింట్ కలెక్టర్ కు వివరించారు. రీ సర్వే పనులు పారదర్శకంగా కొనసాగించాలని లైసెన్సుడ్ సర్వేయర్ల సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రీసర్వే త్వరగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా సర్వే అధికారి గిరిధర్, తహసిల్దార్ జయంతి, మండల గిర్ధవర్ అనురాధ, గ్రామ పరిపాలన అధికారి తదితరులు ఉన్నారు.

Next Story