ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన ఇవాళ రాత్రి ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళ్తున్న ఓ కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువతి, యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులు గచ్చిబౌలి నుంచి కొల్లూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కారు శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతులను సురేందర్‌, ప్రణీతరెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Next Story