VIRAL: చిన్న టైపింగ్ మిస్టేక్‌తో ఘోరం.. 18 నెలలు జైల్లో అమాయకుడు!

by Kema Shiva Kumar |

పోలీసుల చిన్న టైపింగ్ పొరపాటు ఓ అమాయకుడిని జైలు శిక్ష అనుభవించేలా చేసింది.

VIRAL: చిన్న టైపింగ్ మిస్టేక్‌తో ఘోరం.. 18 నెలలు జైల్లో అమాయకుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం ఏదైనా కీబోర్డ్‌పై టైప్ చేసినప్పుడు తప్పుదొర్లితే.. దానిని డిలీట్ చేసి మళ్లీ రీ టైప్ చేస్తాం. లేనిపక్షంలో వైట్‌‌నర్ పెట్టి కూడా అప్పుడప్పడు అడ్జెస్ట్ చేస్తాం. కానీ, అమెరికా పోలీసుల చిన్న టైపింగ్ పొరపాటు ఓ అమాయక కెనడా పౌరుడి జీవితాన్ని నాశనం చేసి, ఏకంగా 18 నెలల పాటు జైలు పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్ పోలీసులుకిక్ మెసెంజర్ (Kik Messenger) యాప్ ద్వారా ఓ 12 ఏళ్ల చిన్నారితో అశ్లీల చాటింగ్ చేస్తున్న ఓ వ్యక్తిపై విచారణ ప్రారంభించారు. బాధితురాలి ఫోన్‌ను పరిశీలించగా నేరస్థుడి యూజర్‌నేమ్ fus__ro_dah‌గా ఉంది. అంటే పేరులో రెడు అండర్‌స్కోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని ‘కిక్’ యాప్‌ను కోరుతూ పోలీసులు జారీ చేసిన నోటీసులలో యూజర్‌నేమ్‌ను fus_ro_dah అంటే ఒక్క అండర్‌స్కోర్‌ మాత్రమే పొరపాటుగా టైప్ చేశారు. దీంతో ‘కిక్’ యాప్ యాజమాన్యం ఆ తప్పుడు యూజర్‌నేమ్‌కు సంబంధించిన ఇమెయిల్ ఐడీని కెనడాకు చెందిన బ్రాండన్ క్లేమ్ (Brandon Klayme)దిగా పోలీసులకు అందించింది.

ఈ మేరకు అమెరికా పోలీసుల సమాచారంతో కెనడా పోలీసులు బ్రాండన్ ఇంట్లో సోదాలు చేసి అతని ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అతడి డివైజ్‌లలో ఆ చిన్నారితో మాట్లాడిన ఆధారాలు గానీ, అశ్లీల చిత్రాలు గానీ లభించకపోయినా, లోతైన దర్యాప్తు లేకుండానే అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో ప్రాసిక్యూటర్లు కానీ, లాయర్లు కానీ యూజర్‌ నేమ్‌లోని తేడాను గమనించలేకపోయారు. ఫలితంగా కోర్టు బ్రాండన్‌కు 18 నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన తర్వాత బ్రాండన్ లాయర్ల బృందం కేసు కాగితాలను నిశితంగా పరిశీలించగా, నోటీసులో ఒక అండర్‌స్కోర్ తగ్గడం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. దాని ఆధారంగా నోవా స్కోటియా కోర్ట్ ఆఫ్ అప్పీల్ బ్రాండన్‌ను పూర్తిగా నిర్దోషిగా ప్రకటించి, అతనిపై ఉన్న శిక్షను రద్దు చేసింది. అసలు నేరస్థుడు కాలిఫోర్నియాకు చెందిన వేరొక వ్యక్తిగా గుర్తించారు. చిన్న పొరపాటు వల్ల ఒక అమాయకుడు తన జీవితంలో అమూల్యమైన కాలాన్ని జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది.

Next Story