- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. కలకలం..!
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆత్రం గంగామణి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆత్రం గంగామణి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. చిన్నారి తల్లిదండ్రులకు తెలియకుండా గ్రామానికి చెందిన నైతం నాగుబాయి ఆమెను సోమవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణానికి తీసుకొచ్చి, బస్టాండ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులకు అప్పగించినట్లు ఆరోపణలు రావడంతో తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఆత్రం కప్లిబాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక, రూరల్ ఎస్‌ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఆదిలాబాద్, తాంసి బస్టాండ్ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, నిందితురాలు చిన్నారితో కలిసి సంచరించిన దృశ్యాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి ఆత్రం గంగామణికి నాలుగేళ్ల వయస్సు ఉండగా, ఆమెకు కోలాం భాషతో పాటు కొద్దిగా తెలుగు మాట్లాడటం వస్తుందని పోలీసులు వెల్లడించారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. చిన్నారి ఎక్కడైనా కనిపించినా లేదా ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్, డయల్ 100 లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన చిన్నారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.






