Tata Sons: టాటా సన్స్‌లో చంద్రశేఖరన్‌కు రూ.158.66 కోట్ల భారీ పారితోషికం

by S Gopi |

2022 నుంచి కంపెనీ పారితోషిక వివరాలను వెల్లడించడం ప్రారంభించిన తర్వాత ఇదే ఆయనకు అత్యధిక ప్యాకేజీ కాగా, గత ఐదేళ్లలో మొత్తం రూ.671.4 కోట్లు అందుకున్నారు.

Tata Sons: టాటా సన్స్‌లో చంద్రశేఖరన్‌కు రూ.158.66 కోట్ల భారీ పారితోషికం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.158.66 కోట్ల పారితోషికం అందుకుని, మరోసారి దేశంలో అత్యధిక వేతనం పొందుతున్న కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా నిలిచారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం, ఇందులో రూ.17.97 కోట్లు జీతం, ఇతర ప్రయోజనాలు కాగా, రూ.140.69 కోట్లు లాభాల ఆధారిత కమిషన్ రూపంలో ఉన్నాయి. 2022 నుంచి కంపెనీ పారితోషిక వివరాలను వెల్లడించడం ప్రారంభించిన తర్వాత ఇదే ఆయనకు అత్యధిక ప్యాకేజీ కాగా, గత ఐదేళ్లలో మొత్తం రూ.671.4 కోట్లు అందుకున్నారు. ఇదే సమయంలో టాటా గ్రూప్ వ్యాపారం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2025-26లో గ్రూప్ ఆదాయం 7.8 శాతం పెరిగి రూ.16.24 లక్షల కోట్లకు, నికర లాభం 51.9 శాతం పెరిగి రూ.1.70 లక్షల కోట్లకు చేరగా, టాటా సన్స్ స్వతంత్రంగా రూ.32,000 కోట్ల లాభం నమోదు చేసింది. టాటా సన్స్‌లో సీఎఫ్‌ఓ సౌరభ్ అగర్వాల్ రూ.33.69 కోట్ల పారితోషికంతో రెండో స్థానంలో నిలిచారు. ఆగస్టు 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో చంద్రశేఖరన్ డైరెక్టర్‌గా మరోసారి వాటాదారుల ఆమోదం కోరనుండగా, చైర్మన్‌గా ఆయన ప్రస్తుత పదవీకాలం 2027, ఫిబ్రవరి వరకు కొనసాగనుంది.

Next Story