- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజ చేస్తామని చెప్పి.. ఆపై వెండి కడియాలు దొంగలించి..!
ఇంట్లో పూజ చేస్తామని చెప్పి, ఇద్దరు మహిళలు ఆ ఇంట్లో దేవుడి గుడి ముందు ఉన్న వెండి కడియాలను ఎత్తుకెళ్లిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది.

దిశ, బైంసా : ఇంట్లో పూజ చేస్తామని చెప్పి, ఇద్దరు మహిళలు ఆ ఇంట్లో దేవుడి గుడి ముందు ఉన్న వెండి కడియాలను ఎత్తుకెళ్లిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. బైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన ముద్దేవార్ శాంతాబాయి మరియు సాయవ్వ అనే ఇద్దరు మహిళలు సోమవారం బైంసా మండలంలోని కోతుల్‌గావ్ గ్రామానికి వెళ్లి భిక్షాటన చేస్తూ... చందుల్‌వార్ దత్తాత్రి అనే రైతు ఇంట్లో లేని సమయం గమనించి, అతని భార్య కవిత వద్దకు వెళ్లారు.
తమ ఇంట్లో వారికి ఆరోగ్యం బాగోలేదని, పూజలు చేసి ఆరోగ్యం బాగు చేస్తామని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించారన్నారు. అనంతరం దేవుడి గదిలో ధూపం వెలిగించి పూజలు చేయడం ప్రారంభించగానే, అప్పటికే పొలం పనులకు వెళ్లిన దత్తాత్రి ఇంటికి చేరుకుని పూజలు గమనించి, అనవసరమైన పూజలు అవసరం లేదని వారిని మందలించగా... అక్కడి నుంచి ఆ ఇద్దరు మహిళలు వెళ్లిపోయారన్నారు. వారు వెళ్లిపోయిన అనంతరం దేవుడి పూజా గదిని పరిశీలించగా, దేవుడి ఫొటోల ముందు ఉంచిన ఐదు తులాల బరువు గల రెండు వెండి కడియాలు కనిపించలేదన్నారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.






