- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్ కేసు.. తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
‘నీట్’ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన NEET-UG పేపర్ లీక్ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన 13 మంది నిందితులపై తొలి చార్జిషీట్‌ను ఇవాళ సీబీఐ దాఖలు చేసింది. ఈ మేరకు బాధ్యులపై క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి తీవ్రమైన బీఎన్ఎస్ (BNS), ఐపీసీ(IPC) సెక్షన్ల కింద సీబీఐ చార్జిషీట్ తయారు చేసింది. పాట్నాలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో ఈ ఫస్ట్ చార్జిషీట్‌ను సమర్పించారు.
ముఠా నెట్‌వర్క్ బట్టబయలు..
కేసు విచారణలో భాగంగా బీహార్, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో విస్తరించిన ముఠా నెట్‌వర్క్, ప్రశ్నపత్రాల చోరీ, అభ్యర్థులకు జవాబులు అందించడం వంటి అంశాలపై సేకరించిన పక్కా ఆధారాలను సీబీఐ కోర్టుకు అందించింది. ఇప్పటికే పేపర్ లీక్ ముఠా సభ్యులు, మధ్యవర్తులు, విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులతో సహా పలువురిని సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసుపై పట్నా కోర్టులో తదుపరి విచారణ కొనసాగనుంది. దర్యాప్తు ఇంకా పూర్తికానందున, మిగిలిన నిందితులపై త్వరలోనే అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేయనున్నట్లుగా సీబీఐ వర్గాలు తెలిపాయి.






