ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటిన విద్యార్థులు, గ్రామస్తులు

by Batti.Sumithra |

గత రెండు రోజులుగా ఉట్నూర్ ప్రాంతంలో వర్షం కురుస్తోంది. తాజాగా మంగళవారం కురిసిన వర్షం వల్ల మండలంలోని నర్సాపూర్ జే వాగు పొంగిపొర్లింది.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటిన విద్యార్థులు, గ్రామస్తులు
X

దిశ, ఉట్నూర్ : గత రెండు రోజులుగా ఉట్నూర్ ప్రాంతంలో వర్షం కురుస్తోంది. తాజాగా మంగళవారం కురిసిన వర్షం వల్ల మండలంలోని నర్సాపూర్ జే వాగు పొంగిపొర్లింది. అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాల ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం కావడంతో గ్రామానికి మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతి పెరిగింది. దిక్కుతోచని స్థితిలో విద్యార్థులతో పాటు కొందరు గ్రామస్తులు వాగు ఒడ్డునే ఉండిపోయారు. వాగు ఉద్ధృతి తగ్గడంతో గ్రామానికి చెందిన పెద్దల సహాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విద్యార్థులను, ప్రజలను వాగు దాటించారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే సమస్యలు తలెత్తుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story