- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఉద్యమం తప్పదు : CJP ఫౌండర్ అభిజిత్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఇటీవల జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తే దేశవ్యాప్తంగా మరొక భారీ ఉద్యమం తప్పదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఇటీవల జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తే దేశవ్యాప్తంగా మరొక భారీ ఉద్యమం తప్పదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా హెచ్చరించారు. విద్యార్థులపై నమోదైన కేసుల పేరుతో వారిని భయభ్రాంతులకు గురిచేయడం, వేధించడం తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ ధోరణిని మార్చుకోకపోతే జంతర్ మంతర్ వద్ద మరోసారి భారీ స్థాయిలో శాంతియుత ధర్నా చేపడతామని కేంద్రానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు.
ఈ నిరసనల సమయంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే నెపంతో తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి వస్తున్న ఈ వరుస పోస్టులు, ఫిర్యాదులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని, వారి భవిష్యత్తును నాశనం చేసేలా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ అండగా నిలుస్తుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.






