ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన.. అర్థరాత్రి తర్వాత కుండపోత వానలు

by Muthe.Rajitha |

ఉత్తర తెలంగాణ జిల్లాలకు మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ(IMD).

ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన.. అర్థరాత్రి తర్వాత కుండపోత వానలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ(IMD). తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం.. అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం వరకు ఉత్తర తెలంగాణ, దాని పరిసర జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా కుండపోతగా అంటే 10 సెంటీమీటర్లకు పైగా అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. వాతావరణ పరిస్థితుల తీవ్రతను బట్టి రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లుండి ఉదయం వరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేశారు. రాత్రి సమయంలో వర్షం పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగు ముమ్మరం చేస్తున్నారు.

Next Story