బెంగళూరు జలమండలిని సందర్శించిన జేఎండీ మయాంక్ మిట్టల్

by Muthe.Rajitha |

జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సమన్వయంతో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డును సందర్శించారు.

బెంగళూరు జలమండలిని సందర్శించిన జేఎండీ మయాంక్ మిట్టల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సమన్వయంతో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డును సందర్శించారు. ఈ పర్యటనలో శుద్ధి చేసిన మురుగునీటి నిర్వహణ, పునర్వినియోగం రంగాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కడుబీసనహళ్లి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. అమృత్ 2.0 టెక్నాలజీ సబ్ మిషన్‌లో భాగంగా పిచ్ పైలట్ ఇనిషియేటివ్ కింద విజయవంతంగా అమలు చేస్తున్న శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగ ప్రాజెక్టు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం ప్రాజెక్టు ప్రాంగణాన్ని సందర్శించి, పైలట్ ప్రాజెక్టులో అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ విధానం, శుద్ధి ప్రక్రియ, శుద్ధి చేసిన నీటి పంపిణీ, వినియోగ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, ప్రాజెక్టును అమలు చేస్తున్న సాంకేతిక బృందంతో సమావేశమై, వ్యవస్థ అమలు, నిర్వహణ, సవాళ్లు, ఉత్తమ పద్ధతులపై సమగ్రంగా చర్చించి ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ అధ్యయన పర్యటన ద్వారా శుద్ధి చేసిన మురుగునీటి సమర్థ వినియోగం, స్థిరమైన నీటి వనరుల నిర్వహణ, భవిష్యత్తులో జలమండలిలో అమలు చేయదగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై విలువైన సమాచారాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు.

Next Story