రెండు రోజుల పాటు వానల జోరు.. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Ramesh Naini |

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రెండు రోజుల పాటు వానల జోరు.. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపు (జులై 29), ఎల్లుండి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలి వేగం గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

మెదక్ జిల్లా చేగుంటలో 8 సెం.మీ.ల వర్షం:

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా చేగుంటలో 8 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 7 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 7 సెం.మీ, మెదక్ జిల్లా మెదక్ లో 6 సెం.మీ, పాపన్నపేట్ లో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 6 సెం.మీ, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 6 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ లో 5 సెం.మీ, బోయిన్ పల్లిలో 5 సెం.మీ, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 5 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా దౌల్తాబాద్ లో 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా గాంధారిలో 5 సెం.మీ, నిజాంసాగర్ లో 5 సెం.మీ, పెద్దపల్లిజిల్లా పెద్దపల్లిలో 5 సెం.మీ, మంథనిలో 4 సెం.మీ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, లింగంపేట్, బిక్నూర్ లో 4 సెం.మీ, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 4 సెం.మీ, చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

గ్రేటర్ లో 5 సెం.మీ ల వర్షం:

గ్రేటర్ పరిధిలో మంగళవారం సాయంత్రం ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీలో 4.7 సెం.మీ, బౌద్ధ నగర్ లో 4.6 సెం.మీ, బన్సీలాల్ పేట్ లో 4.4 సెం.మీ, షేక్ పేట్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఐటీ క్యాంపస్ లో 4 సెం.మీ, తిరుమల గిరి జింఖానా ఈఎస్ఎస్ లో 3.3, ఖైరతాబాద్ రహ్మత్ నగర్ లో 3.8 సెం.మీ, బాల్ నగర్ లో 3,8 చొప్పున వర్షపాతం నమోదైంది.

Next Story