- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విహారయాత్రకు వస్తే... విషాదం మిగిల్చింది
విహారయాత్ర రెండు కుటుంబాలలో విషాదం నింపిన ఘటన విలీన మండలం చింతూరు లో చోటుచేసుకుంది.

దిశ, భద్రాచలం : విహారయాత్ర రెండు కుటుంబాలలో విషాదం నింపిన ఘటన విలీన మండలం చింతూరు లో చోటుచేసుకుంది. తెలంగాణా సరిహద్దు, ఆంధ్రలోని పోలవరం జిల్లా,చింతూరు మండలం, మోతుగూడెం పోలీస్టేషన్ పరిధిలోని తులసిపాక ఘాట్ రోడ్ లో గల వ్యూ పాయింట్ సమీపంలో ప్రవహిస్తున్న సోకులేరు వాగులో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతు అయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.... పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, వీరంపాలెం గ్రామానికి చెందిన కళ్యాణ్ (26), బాబు (21) అనే ఇద్దరు యువకులు, అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం మోతుగూడెం వచ్చారు. ప్రకృతి అందాలు చూసిన తర్వాత, వ్యూ పాయింట్ కు చేరుకొని సోకులేరు వాగులో ఈతకు దిగారు. వాగు ఉదృతంగా ప్రవహించడంతో లోతు తెలియక బాబు నీటిలో కొట్టుకుపోవడం చూసిన కళ్యాణ్ బాబును రక్షించడానికి ప్రయత్నించి అతను కూడా నీటి ప్రవాహంలో గల్లంతు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినా.. బాబు, కళ్యాణ్ ఆచూకి లభించలేదు.ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయు.






