- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల సమస్యలను పరిష్కరించడం మున్సిపల్ కౌన్సిలర్ల బాధ్యత
మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడం కౌన్సిలర్ల బాధ్యత అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే.శ్రీనివాస రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడం కౌన్సిలర్ల బాధ్యత అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే.శ్రీనివాస రావు అన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం జీవితంలో కొద్ది మందికే వస్తుందని, ఆ భాగ్యం కలిగిన మీరు ప్రజోపయోగ కార్యక్రమాలతో ఒక మంచి మున్సిపాలిటీగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలలో వార్డ్ మెంబర్ గాను, కౌన్సిలర్ గాను ఎన్నుకోబడ్డ తమ విధులు, బాధ్యతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న నిధులతో వివిధ పథకాల కింద మీరు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఏర్పాటు చేసిన ఈ ఒకరోజు సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఎన్ఐయూఎం, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఇస్కీ) సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ మెంబర్ల రెండో విడత వర్క్ షాప్ ఇస్కీ కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం జరిగింది.
43 మున్సిపాలిటీల కౌన్సిలర్లు సుమారు 700 మంది పాల్గొన్న సమావేశాన్ని సీనియర్ మున్సిపల్ అధికారులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గత రెండు నెలల కింద మున్సిపల్ ఛైర్మెన్ లకు, వైస్ ఛైర్మెన్ లకు వాళ్ళ విధులు బాధ్యతలపై శిక్షణ అందించామని, రాష్ట్రంలోని 135 మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లకు కూడా వారి విధులు బాధ్యతలపైనే కాకుండా తెలంగాణా మున్సిపల్ చట్టం 2019తో పాటుగా స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్, నగరాభివృద్ధి గురించి సంబంధిత అధికారులు వివరిస్తారని శ్రీనివాస రావు తన స్వాగాతోపన్యాసంలో అన్నారు మున్సిపాలిటీలలో ఇంటింటి చెత్త సేకరణ మొదలు తాగునీరు, పారిశుద్ధ్యం వీధి దీపాలు, మోరీలు, పార్కులు, పచ్చదనం ..ఇలా పుట్టుక నుండి చావు వరకు అన్నీ ప్రజలు సమస్యలేనని ఈ సర్వీసులన్నీ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులదేనని సీనియర్ ఫ్యాకల్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు.
ప్రభుత్వ స్థలాలు, మున్సిపల్ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత కౌన్సిలర్స్ పై ఉందన్నారు. సమావేశంలో అమృత్ నగరాభివృద్ధి గురించి రిటైర్డ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, తెలంగాణ మున్సిపల్ చట్టం, స్వచ్చ్ భారత్ మిషన్ గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ కె. ఫల్గుణ కుమార్, జల్ సంచాయి జన్ భాగీదారి గురించి మరొక జాయింట్ డైరెక్టర్ సంధ్య, అమృత్ లోని వివిధ కార్యక్రమాలపై జాయింట్ డైరెక్టర్ వి. మమత, జండర్ సెన్సిటైజేషన్ గురించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్ సునీతా రాణి ప్రెజెంటేషన్స్ ద్వారా వివరించారు.






