తిరుపతిలో కలుషిత ఆహారం కలకలం..! ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థులకు అస్వస్థత

by Ramesh Naini |

తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.

తిరుపతిలో కలుషిత ఆహారం కలకలం..! ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక వైద్య కళాశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. ఈ ఘటనలో 25 మంది యూజీ విద్యార్థులు, ఏడుగురు పీజీ విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌తో పాటు టీటీడీ సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కలుషిత ఆహారమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.

Next Story