- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2 లక్షల గోవా మద్యం సీజ్.. కారుతో సహా నిందితుల అరెస్ట్
by Batti.Sumithra |
ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

X
దిశ, శంషాబాద్ : ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.2 లక్షల విలువైన 98 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఒక కారును సీజ్ చేశారు. వివరాలు ఇబ్రహీం పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారాంతాల్లో విమానంలో గోవా వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చి కిరాణా దుకాణాల వినియోగదారులు, ప్రైవేట్ ఫంక్షన్ నిర్వాహకులకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి చర్యల కోసం శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story






