- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ సందడి చేయనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. సాధారణంగా వాట్సాప్‌లో ఏవైనా ఫోటోలు, వీడియోలను స్టేటస్‌గా పోస్ట్ చేసిన తర్వాత అందులోని క్యాప్షన్‌లో ఏవైనా అక్షర దోషాలు ఉంటే, ఆ స్టేటస్‌ను డిలీట్ చేసి మళ్లీ కొత్తగా పోస్ట్ చేయాల్సి వచ్చేది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఎడిట్ స్టేటస్ క్యాప్షన్ (Edit Status Caption) ఫీచర్‌పై వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తోంది.
ఈ ఫీచర్ ప్రత్యేకతలు ఇవే..
వాట్సాప్‌లో పోస్ట్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లోని క్యాప్షన్‌ను డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా సవరించుకోవచ్చు. స్టేటస్ పోస్ట్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోపు మాత్రమే ఈ క్యాప్షన్‌ను ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యూజర్లు తాము పెట్టిన స్టేటస్ వ్యూ స్క్రీన్‌పై కనిపించే పెన్సిల్ ఐకాన్ ద్వారా గానీ, లేదా త్రీ డాట్స్ మెనూలోని ఎడిట్ క్యాప్షన్ ఆప్షన్‌ను ఎంచుకుని క్యాప్షన్‌ను మార్చవచ్చు. సాధారణ మెసేజ్‌లను ఎడిట్ చేసినప్పుడు ఎడిటెడ్ అని కనిపిస్తుంది. కానీ, స్టేటస్ క్యాప్షన్‌ను ఎడిట్ చేస్తే ఇతరులకు ఎలాంటి ప్రత్యేక ఎడిటెడ్ లేబుల్ కనిపించదు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వర్షన్ (Android Beta Version) యూజర్లకు మాత్రమే టెస్ట్ దశలో అందుబాటులో ఉంది. ఆ టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ (iOS) వినియోగదారులందరికీ ఈ కొత్త అప్‌డేట్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.






