- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఐఎండీ ‘రెడ్ అలర్ట్’: రేపు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే డిక్లేర్

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు దేశంలోని అన్ని రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు నాగ్‌పూర్ సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీలు, కోచింగ్ సెంటర్లకు సెలవు ప్రకటిస్తూ నాగ్‌పూర్ జిల్లా కలెక్టర్, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ కుమార్ ఆశీర్వాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, నాగ్‌పూర్ నగరంలో ఇప్పటికే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 108 మి.మి కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉండటం, ట్రాఫిక్ నిలిచిపోవడం, ఇతర అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భద్రతను కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా తరగతులను రద్దు చేసినట్లుగా జిల్లా యంత్రాంగం తెలిపింది.






