- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీమవరం కలెక్టరేట్ రోడ్డులో క్షుద్ర పూజల కలకలం!
by Ramesh Naini |
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ప్రధాన రహదారిపై క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ప్రధాన రహదారిపై క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. భారతీ విద్యా విహార్ సమీపంలో రోడ్డు పక్కన ఎర్ర గుడ్డలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు తదితర పూజా సామాగ్రిని స్థానికులు గుర్తించారు.
నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ప్రధాన మార్గంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంతో స్థానికులు, దారిన వెళ్లే వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మూఢనమ్మకాలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించి, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






