వక్ఫ్ భూములను పరిరక్షించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

by Kodari Anjali |

జిల్లాలో వక్ఫ్ భూముల పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆక్రమణలను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.

వక్ఫ్ భూములను పరిరక్షించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
X

దిశ, వరంగల్ బ్యూరో: జిల్లాలో వక్ఫ్ భూముల పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆక్రమణలను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వక్ఫ్ పరిరక్షణ మరియు సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పెండింగ్‌లో ఉన్న అంశాలు, భూముల రికార్డుల నిర్వహణ, ఆక్రమణల నివారణ, శాఖల మధ్య సమన్వయంపై సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములకు సంబంధించిన ప్రతి అంశాన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జిల్లా రెవెన్యూ అధికారి విజయ లక్ష్మి, వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణిలు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి రమేష్, జిల్లా రిజిస్ట్రార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాస్ లు, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Next Story