బ్రేకింగ్ న్యూస్.. రాష్ట్రంలో లక్ష చికెన్ షాపుల మూసివేత!

by Muthe.Rajitha |

రాష్ట్రంలో చికెన్ ప్రియులకు షాక్ తగలనుంది.

బ్రేకింగ్ న్యూస్.. రాష్ట్రంలో లక్ష చికెన్ షాపుల మూసివేత!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో చికెన్ ప్రియులకు షాక్ తగలనుంది. దాదాపు లక్ష వరకు చికెన్ షాపుల మూసివేతకు పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోనుంది. తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా జూలై 31 నుంచి చికెన్ విక్రయాలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు 'తమిళనాడు పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్' ప్రకటించింది. పౌల్ట్రీ యాజమాన్యాలు అనుసరిస్తున్న కొన్ని అనుచిత వ్యాపార పద్ధతులు, కోళ్ల బరువు పెంపుకు వాడుతున్న పద్దతులను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రభావంతో రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు రిటైల్ చికెన్ దుకాణాలు మూతపడే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ వినియోగదారులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులకు కోడిమాంసం సరఫరా తీవ్రంగా దెబ్బతిననుంది.

పౌల్ట్రీ ఉత్పత్తిదారులు కోళ్లను విక్రయానికి వాహనాల్లోకి ఎక్కించే చివరి నిమిషం వరకు వాటికి విపరీతంగా దాణా, నీళ్లు అందిస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. దీనివల్ల ప్రతి కోడి కడుపులో దాదాపు 100 నుండి 200 గ్రాముల వరకు జీర్ణకాని ఆహారం ఉండిపోయి, కృత్రిమంగా కోడి బరువు పెరుగుతోంది. ఈ రకమైన దాణా తయారీకి ఉత్పత్తిదారులకు కేవలం రూ.3 నుంచి 4 మాత్రమే ఖర్చవుతుండగా, రిటైల్ వ్యాపారులు మాత్రం ఆ అదనపు బరువుకు కిలో చొప్పున రూ.10 నుండి 12 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని భరించలేక చివరికి వినియోగదారులపై రుద్దాల్సి వస్తోందని, అంతేకాకుండా కోళ్లను కోసే సమయంలో కడుపులోని వ్యర్థాలు మాంసంపై పడి చికెన్ నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.

సాధారణంగా రవాణా నిబంధనల ప్రకారం కోళ్లను విక్రయ స్థలాలకు తరలించడానికి కనీసం 8 నుండి 12 గంటల ముందే దాణా ఇవ్వడం ఆపేయాల్సి ఉంటుంది. అయితే ఉత్పత్తిదారులు లాభాపేక్షతో ఈ నిబంధనలను బొత్తిగా పాటించడం లేదని, కనీసం 15 గంటల ముందే దాణా ఇవ్వడం ఆపేలా కఠినమైన ఆదేశాలు జారీ చేసే వరకు విక్రయాలు పునరుద్ధరించేది లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. తమిళనాడు వ్యాపారులు చేపట్టిన ఈ నిరసన పోరాటానికి పొరుగు రాష్ట్రమైన కేరళలోని వ్యాపారుల సంఘాలు కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించాయి.

Next Story