- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యామ్నాయ పంటల పై మొగ్గు చూపాలి : కలెక్టర్ ప్రతిమ సింగ్
రైతులు వరి పంటల సాగు కంటే ప్రత్యామ్నాయ పంటలపై.. ముగ్గు చూపాలని, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు.

దిశ, నిజాంపేట : రైతులు వరి పంటల సాగు కంటే ప్రత్యామ్నాయ పంటలపై.. ముగ్గు చూపాలని, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామశివారులో గల ఫామ్ ఆయిల్ నర్సరీని మంగళవారం ఆమె సందర్శించారు. నర్సరీలో నాలుగు లక్షల మొక్కలు ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెట్టుకోవాలంటే.. నర్సరీ నుంచి మొక్కలను పంపిస్తున్నారన్నారు. ఏలినో ప్రభావం వల్ల వరి సాగులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆయిల్ ఫామ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండాయన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ పై మొగ్గు చూపాలన్నారు.
సమస్య తీర్చాలని వినతి..
గత ఐదు సంవత్సరాల నుండి చల్మెడ కమాన్ నుండి నందగోకుల్ గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా కంకర పోసి వదిలేశారని, దీనివల్ల ఇరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సర్పంచులు భాను ప్రకాష్ రెడ్డి, బొమ్మన మల్లేశం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, ఎంపీడీవో రాజీరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు.






