- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్‌లో ఇబ్బందులు: మంత్రి వాకిటి శ్రీహరి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు.

దిశ, మక్తల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు. అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా బీ ఎల్ ఏలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని, ప్రతీ ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ చివరి 6 రోజులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు 90 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని ఈ సందర్బంగా మంత్రి బీ ఎల్ ఏ లకు గుర్తు చేశారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించడంలో బీ ఎల్ ఏల పాత్ర ఎంతో కీలకమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను మెజారిటీ సర్పంచులను గెలిచామని గుర్తు చేశారు. సీఎం నియోజకవర్గం తర్వాత మక్తల్ నియోజకవర్గంలోనే 1890 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అభివృద్ధిలో రోడ్లు, వంతెనలు, ఇందిరమ్మ ఇండ్ల అనేక సంక్షేమం పథకాల్లో మక్తల్ నియోజకవర్గం అగ్రగామిగా ఉందన్నారు. నియోజకవర్గంలోని 7 మండలాలు, 3 మున్సిపాలిటీల్లోని పార్టీ అధ్యక్షులు, నాయకులు ఓటర్ సవరణ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అన్నీ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.






