టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ట్రాఫిక్-2 డీసీపీ కాజల్ సింగ్

by Taduka Kalyani |

వార్షిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజల్ సింగ్ మంగళవారం టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.

టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ట్రాఫిక్-2 డీసీపీ కాజల్ సింగ్
X

దిశ, కార్వాన్ : వార్షిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజల్ సింగ్ మంగళవారం టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ రికార్డులను, వాహనాల నిర్వహణ, స్టేషన్ రోజువారీ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి రోల్ కాల్ నిర్వహించి, విధినిర్వహణపై తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది సంక్షేమ వివరాలను అడిగి తెలుసుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీనితో పాటు, టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాయింట్ డ్యూటీలో ఉన్న సిబ్బంది పనితీరును మరియు క్షేత్రస్థాయిలో ప్రజల భద్రతకు చేపడుతున్న చర్యలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ ట్రాఫిక్ ఏసీపీ డి. ధనలక్ష్మి సీనియర్ ట్రాఫిక్ అధికారులు స్థానిక స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story