- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jharkhand Police: సీనియర్ కమాండర్లు సహా 24 మంది మావోయిస్టుల లొంగుబాటు
వీరిలో ఆరుగురిపై మొత్తం రూ.39 లక్షల రివార్డు ఉండగా, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టు నెట్‌వర్క్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ రాష్ట్రంలో భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ నవజీవన్-II'తో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన సీనియర్ కమాండర్లు, స్క్వాడ్ సభ్యులు సహా 16 మంది క్రియాశీల మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఆరుగురిపై మొత్తం రూ.39 లక్షల రివార్డు ఉండగా, ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, ముగ్గురు జోనల్ కమిటీ సభ్యులు, ముగ్గురు సబ్-జోనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు స్క్వాడ్ సభ్యులు ఉన్నారు. వారి నుంచి 6 ఇన్సాస్ రైఫిల్స్, 2 ఏకే-47లు, ఒక ఎం-16, ఒక హెచ్‌కె-33 రైఫిల్, ఒక యూఎస్ కార్బైన్ సహా మొత్తం 11 ఆయుధాలు, 38 మ్యాగజైన్లు, 1,562 లైవ్ కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన నిరంతర ఆపరేషన్లు, ప్రభుత్వ పునరావాస విధానం వల్లే ఈ లొంగుబాట్లు జరిగాయని డీజీపీ తదాషా మిశ్రా తెలిపారు. ఇదే సమయంలో ఇదే నెట్‌వర్క్‌కు చెందిన మరో ఎనిమిది మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో కూడా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జార్ఖండ్‌లో 45 మంది మావోయిస్టులు లొంగిపోగా, 93 మంది అరెస్టయ్యారు, 22 మంది ఎన్‌కౌంటర్లలో మరణించారు.






