- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల టోకరా..!
అమాయక నిరుద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటుచేసుకుంది.

దిశ, నార్నూర్ (ఆదిలాబాద్) : అమాయక నిరుద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురిని నార్నూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో చహకాటి లింబారావు, జాడి ప్రవీణ్ కుమార్, రాంటెంకీ ఉదయ్ కిరణ్, జాడి రవీందర్ ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
విచారణలో ప్రధాన నిందితుడు చాహకటి లింబారావు జిల్లా ట్రెజరీ ఆఫీసర్‌గా తప్పుడు ప్రచారం చేసుకుంటూ, ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. బాధితులకు నకిలీ జాయినింగ్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 25 మందికి పైగా బాధితుల నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి మోసాలకు గురైన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఉద్యోగాలు లేదా రుణాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎస్సై శ్రీ సాయితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






