- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ యాదవ్‌ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

దిశ, మాడుగులపల్లి : మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ యాదవ్‌ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని కోరారు. పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన ఎస్సై సురేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పగిళ్ల సైదులు, సర్పంచులు పెద్ది కృపాకర్, సర్నాల నాగరాజు, వీరబోయిన నాగరాజు, బూర సరిత రమేష్, ఊర ప్రసన్న రాబర్ట్, రాయరపు ఉమారాణి, నన్నెపోయిన పార్వతమ్మ, బొబ్బలి కావ్య శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు కర్ర శ్రీనివాస్ రెడ్డి, షేక్ ఖాసీం, తవిటి సైదులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






