కాంగ్రెస్-బీజేపీ క్రెడిట్ రాజకీయాలు మానాలి..

by Batti.Sumithra |

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.36ను స్వాగతిస్తున్నామని, అయితే జీవోతోనే సరిపెట్టకుండా వెంటనే రూ.2,278 కోట్ల నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.

కాంగ్రెస్-బీజేపీ క్రెడిట్ రాజకీయాలు మానాలి..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.36ను స్వాగతిస్తున్నామని, అయితే జీవోతోనే సరిపెట్టకుండా వెంటనే రూ.2,278 కోట్ల నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును తానే తీసుకొచ్చానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.

కేంద్ర ప్రభుత్వ పాత్రను విస్మరించడం సరైంది కాదన్నారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అలాగే చనాక-కొరటా బ్యారేజ్ పనులు రెండున్నరేళ్లుగా పూర్తి కాకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ అభివృద్ధికి రూ.6,070 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని..ప్రస్తుతం జీవోలు విడుదల చేసి ప్రచారం చేసుకోవడం కాకుండా నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజ్జగిరి నారాయణ, యూనిస్ అక్బాని,మెట్టు ప్రహ్లాద్,తదితరులు పాల్గొన్నారు.

Next Story