సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై పొంగులేటి ఆరా

by Muthe.Rajitha |

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరా తీశారు.

సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై పొంగులేటి ఆరా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరా తీశారు. మంగళవారం సుదర్శన్‌రెడ్డి చికిత్స పొందుతున్న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని.. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story