- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం..
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అధికారులను ఆదేశించారు.

దిశ, కొండగట్టు : కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ గిరి ప్రదక్షిణలో పాల్గొననున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే గిరి ప్రదక్షిణ మార్గాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గంలో దెబ్బతిన్న ప్రాంతాలను వెంటనే మరమ్మతులు చేయాలని, మార్గమంతా తాగునీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకునేలా ప్రతి అంశాన్ని ముందస్తుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనారెడ్డి, కొండగట్టు సర్పంచ్ ఆదిరెడ్డి, నాయకులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కమలాకర్ రెడ్డి, ముత్యం శంకర్ తదితరులు పాల్గొన్నారు.






