‘మా డిమాండ్లు తీర్చాల్సిందే’: సుప్రీంకోర్టు తీర్పుపై సీజేపీ నేత సౌరభ్ దాస్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-28 11:30:06  IST  )

యువతపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ డిమాండ్ చేశారు.

‘మా డిమాండ్లు తీర్చాల్సిందే’: సుప్రీంకోర్టు తీర్పుపై సీజేపీ నేత సౌరభ్ దాస్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఆందోళనకారుల డిమాండ్లపై కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) సీనియర్ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. యువత ప్రయోజనాలను కాపాడేలా సుప్రీంకోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పులనైనా తాము స్వాగతిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల కంటే ముందు తాము క్షేత్రస్థాయిలో చేసిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని స్పష్టం చేశారు.

ఇక ధర్మాసనం ఇచ్చే తీర్పులు తమ డిమాండ్లకు అదనంగా (In addition) ఉండాలే తప్ప, తమ అసలు డిమాండ్లను పక్కన పెట్టకూడదని సౌరభ్ దాస్ తెలిపారు. ఇక ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో వారిపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ (Written guarantee) రావాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న, అరెస్ట్ చేసిన ఆందోళనకారులు అందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, ఢిల్లీ వేదికగా మరోసారి భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తామని సౌరభ్ దాస్ హెచ్చరించారు.

Next Story