- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమం అమలు చేయాలి
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో అమలు చేయాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు.

దిశ, నూతనకల్ : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావం, జలసిరి కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య మాట్లాడుతూ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వీబీజీ–రామ్‌జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు విస్తృతంగా చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు.
ప్రతి గ్రామంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామసభలు నిర్వహించి జలసిరి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి నీటి చుక్కను సంరక్షించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్‌పర్సన్ నాగం జయసుధ, మండల ప్రత్యేక అధికారి భారతి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






