- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిరమ్’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. వివిధ కోణాలను చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ పోస్ట్
మాజంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రీతి అస్రాని ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల '29' అనే చిత్రంతో అక్కడ భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ, ప్రస్తుతం స్టార్ నటుడు ఎస్.జె. సూర్య సరసన 'కిల్లర్' అనే మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు కోలీవుడ్‌లో ఆమె నటిస్తున్న మరొక క్రేజీ ప్రాజెక్ట్ ‘నిరమ్’. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.దర్శకుడు కృష్ణ బలరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తాన్యా హోప్, నితిన్ సత్య, సురేఖ వాణి, సురేష్ చక్రవర్తి, శ్రీజిత్ రవి, తిరునావుక్కరసు, గజరాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. 'కేస్క్వేర్ సినిమాస్' నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
సమాజంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ఎంతో ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా మూవీ మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ‘నిరమ్’ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్, ట్రైలర్‌ను జూలై 30న ఘనంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పంచుకున్న స్పెషల్ పోస్టర్‌లో ఒక పెద్ద డోలుపై ఎర్రటి గుడ్డ వేసి, దాని చుట్టూ పూలు, దీపాలతో ఎంతో సాంప్రదాయబద్ధంగా అలంకరించి ఉంది. "కథలోని విభిన్న కోణాలను చూసేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ మేకర్స్ తెలిపిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






