శరీర భాగాలు ఎలా కదులుతున్నాయనే దానిపై కాదు.. మా ముఖాలపై దృష్టి పెట్టండి: జరీన్ ఖాన్

by Mallepaka Hamsa |

కెమెరాలు ఎప్పుడూ నటీమణుల ముఖాలు, వారి నటనపై మాత్రమే దృష్టి పెట్టాలని, అంతేగానీ శరీర భాగాలు ఏ విధంగా కదులుతున్నాయనే దానిపై కాదని ఘాటుగా చెప్పారు.

శరీర భాగాలు ఎలా కదులుతున్నాయనే దానిపై కాదు.. మా ముఖాలపై దృష్టి పెట్టండి: జరీన్ ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ గత కొద్ది రోజులుగా సెన్సేషనల్ వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో కొందరు ఫొటోగ్రాఫర్లు హద్దులు దాటి ప్రవర్తించిన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మరోసారి ఘాటు సంచలన కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలోనూ, బయటా నటీమణుల పట్ల కొందరి ప్రవర్తనపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా నెటిజన్లు, కెమెరామెన్లు నటీమణులను చూసే తీరు మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. తమ పిరుదుల సైజు లేదా శరీర భాగాలను బట్టి కాకుండా, వెండితెరపై ప్రదర్శించే నటన, ప్రతిభ ఆధారంగానే గుర్తింపు పొందాలని తమలాంటి నటీమణులు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

కెమెరాలు ఎప్పుడూ నటీమణుల ముఖాలు, వారి నటనపై మాత్రమే దృష్టి పెట్టాలని, అంతేగానీ శరీర భాగాలు ఏ విధంగా కదులుతున్నాయనే దానిపై కాదని ఘాటుగా చెప్పారు. అంతేకాకుండా ఈ సంస్కృతి వెనుక ఉన్న కొన్ని విషయాలను కూడా ఆమె బయటపెట్టారు. ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు డబ్బుల కోసమే కెమెరాల ముందు అలాంటి భంగిమలు ఇస్తుంటారని, వారికలా చేసినందుకు డబ్బులు ముడతాయని తనకు తెలుసని చెప్పారు. అలాంటి పనులు కేవలం డబ్బులు తీసుకునే వారి వద్ద మాత్రమే చేసుకోవాలని, అలా కాకుండా స్వచ్ఛందంగా తమ పని తాము చేసుకుపోయే ఇతర నటీమణులతో మాత్రం ఇలాంటి పనులు చేయకూడదని గట్టిగా హెచ్చరించారు. ఎలాంటి దాపరికం లేకుండా చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారాయి. మహిళా సెలబ్రిటీల ఆత్మగౌరవం గురించి ఆమె స్పందించిన తీరుకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

Next Story