- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకౌంట్ రికవరీకి గూగుల్ కొత్త ఫీచర్.. ‘సెల్ఫీ వీడియో’తో నో టెన్షన్!
గూగుల్ తన యూజర్లకోసం సెల్ఫీ వీడియో ఆధారిత ఖాతా రికవరీ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది.

దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు గూగుల్ అకౌంట్ లాక్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ నంబర్, ఇ-మెయిల్ వంటి ఇతర సాధారణ రివకరీ మెథడ్స్ పనిచేయకపోతే యూజర్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో తమ ఖాతా రికవరీ కాకపోవడం వల్ల కొత్త ఇ-మెయిల్ లేదా జీ-మెయిల్ క్రియేట్ చేసుకుంటుంటారు. కానీ ఇక నుంచి అలాంటి అవస్థలు పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే గూగుల్ రీసెంట్‌గా తన యూజర్లకోసం సెల్ఫీ వీడియో (Selfie Video) ఆధారిత ఖాతా రికవరీ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కొందరు యూజర్లకు రోల్ అవుట్ అవుతోంది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? ఇతర ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ (Google) ప్రవేశ పెట్టిన ‘Selfie Video’ ఆధారిత ఖాతా రికవరీ ఫీచర్‌ను ఉపయోగించాలంటే.. యూజర్లు ముందుగా తమ డివైజ్ కెమెరాను చూస్తూ.. గైడెడ్ హెడ్ మూవ్‌మెంట్స్ (తలను పక్కకు తిప్పడం వంటివి) చేస్తూ ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాలి. ఇది మల్టిపుల్ ఫేషియల్ యాంగిల్స్‌ను క్యాప్చర్ చేసి, భవిష్యత్తులో రికవరీ సమయంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
యూజర్ సేఫ్టీ & ప్రాసెస్
మెయిల్ అకౌంట్ రికవరీ సమయంలో యూజర్ మరొక కొత్త సెల్ఫీ వీడియో తీయాల్సి ఉంటుంది. ముందుగానే ఒక రికార్డెడ్ వీడియో గూగుల్ వద్ద ఉంటుంది. కాబట్టి ఈ కొత్త వీడియోను గూగుల్ ఇప్పటికే సేవ్ చేసిన వీడియోతో సరిపోల్చి, లైవ్‌నెస్ డిటెక్షన్ ద్వారా డీప్‌ఫేక్స్ లేదా స్పూఫింగ్ ప్రయత్నాలను నిరోధిస్తుంది. వీడియోలు ఎన్‌క్రిప్టెడ్‌గా సురక్షితంగా నిల్వ చేయబడతాయి. అంతేకాకుండా యూజర్ ఎప్పుడైనా దీనిని డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఆప్ట్-ఇన్ ఫీచర్ కాబట్టి ముందుగానే సెటప్ చేసుకోవాలి. ఖాతా లాక్ అయిన తర్వాత సెటప్ చేయడం సాధ్యం కాదు.
ఎలా సెటప్ చేసుకోవాలి?
*myaccount.google.comకి వెళ్లి సైన్ ఇన్ చేయండి
*Security & sign-in (లేదా Security) సెక్షన్‌కి వెళ్లండి
*‘How you sign in to Google’ విభాగంలో Selfie video ఆప్షన్ కనిపిస్తే దాన్ని ఎంచుకోండి. (అయితే ఇప్పుడిప్పుడే ఇది రోల్ అవుతున్న ఫీచర్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఎలిజిబుల్ అయితే మాత్రమే కనిపిస్తుంది)
*కెమెరా ఓపెన్ చేసి, ఆన్-స్క్రీన్ గైడెడ్ హెడ్ మూవ్‌మెంట్స్ (తల తిప్పడం, టిల్ట్ చేయడం) అనుసరించి చిన్న వీడియో రికార్డ్ చేయండి.
పూర్తి అయిన తర్వాత వెరిఫై చేసి సేవ్ చేయబడుతుంది.
ప్రయోజనాలు
*గూగుల్ అకౌంట్ లాక్ అయినప్పుడు లేదా పాస్‌వర్డ్ మరచిపోయినప్పుడు, ఫోన్ లేదా ఇతర డివైజ్ యాక్సెస్ లేనప్పుడు సులభంగా రికవరీ చేసుకోవచ్చు.
*లైవ్‌నెస్ డిటెక్షన్ (తల కదలికలు) ద్వారా డీప్‌ఫేక్స్, ఫోటోలు లేదా స్పూఫింగ్‌ను నిరోధిస్తుంది.
*ఎన్‌క్రిప్టెడ్‌గా సేవ్ అవుతుంది. అలాగే యూజర్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.
*సాధారణ రికవరీ మెథడ్స్ (ఇమెయిల్, ఫోన్) పని చేయని సందర్భాల్లో అదనపు ఆప్షన్‌గా పని చేస్తుంది.
*ఇతర ఉపయోగాల విషయానికి వస్తే ఏజ్ వెరిఫికేషన్, ఏఐ అవతార్ క్రియేషన్ వంటి ఉపయోగాలు ఉంటాయి.
*ఈ అప్‌డేట్ ఖాతా రికవరీని వేగవంతం చేస్తూ, ఫ్రాడ్ & అనధికారిక యాక్సెస్ రిస్క్‌ను తగ్గిస్తుంది. పాస్‌కీలు, రికవరీ కాంటాక్ట్స్ వంటి ఇతర ఆప్షన్లకు అదనంగా ఉంటుంది.






