- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఎక్కడికి పారిపోలేదు.. ఆరోపణలపై స్పందించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణా రెడ్డి
ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణా రెడ్డి కనిపించకుండా పోయారు అనే ఆరోపణలపై ఆయన స్పందించారు. తన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని అన్నారు. తన నాన్న అనారోగ్యంతో ఉండటం వల్ల స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణా రెడ్డి కనిపించకుండా పోయారు అనే ఆరోపణలపై ఆయన స్పందించారు. తన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని అన్నారు. తన నాన్న అనారోగ్యంతో ఉండటం వల్ల స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చానని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, న్యాయ, పోలీస్ వ్యవస్థలపై నమ్మకంతోనే విచారణకు హజరవుతున్నానని అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువ విషయాలు చెప్పలేకపోతున్నానని అన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని తెలిపారు. తాను పూర్తి గ్రామీణ నేపథ్యం నుండి వచ్చానని, తన శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు.
ఇదిలా ఉంటే ఉదయ కృష్ణా రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, రూమ్ లోకి లాక్కెళ్లి వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఆత్మహత్య యత్నం చేసినట్టు ఓ సూసైడ్ నోట్ రాశాడు. అయితే అతడి సూసైడ్ బూటకం అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక కోర్టు అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో తప్పించుకుని తిరుగుతున్నాడని, నోటీసులు పంపండంతో కనిపించకుండా పోయాడని పోలీసులు చెప్పారు. దీంతో ఆయన అది అవాప్తవం అంటూ స్పందించారు.






