- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారర్ థ్రిల్లర్ ‘418’ రిలీజ్ వాయిదా.. నిరీక్షణకు ఖచ్చితంగా తగిన ఫలితం లభిస్తుందంటూ మేకర్స్ పోస్ట్
ఆ భయంకరమైన తలుపు మరికొద్ది రోజుల్లోనే తెరచుకోబోతోంది. అయితే, '418' ఫిల్మ్‌ను జూలై 31న మాత్రం విడుదల చేయడం లేదు.

దిశ, సినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’. విభిన్నమైన కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మంచి గుర్తింపు పొందిన ప్రీతి పగడాల హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ సపోర్ట్ అందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి కీర్తన్ నాగగౌడ కథను అందించడంతో పాటు స్వయంగా దర్శకత్వ బాధ్యతలను కూడా వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం జూలై 31న విడుదల కావడం లేదని, విడుదల వాయిదా పడిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ వార్తలపై తాజాగా స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేసింది. "ఆ భయంకరమైన తలుపు మరికొద్ది రోజుల్లోనే తెరచుకోబోతోంది. అయితే, '418' ఫిల్మ్‌ను జూలై 31న మాత్రం విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు మీరు చూపించిన సహనానికి, మాపై కురిపిస్తున్న అపరిమితమైన ప్రేమకు ధన్యవాదాలు. మీరు అందిస్తున్న ఈ ప్రేమనంతటినీ త్వరలోనే మరింత భయంకరమైన భయం రూపంలో తిరిగి ఇచ్చేస్తామని మాటిస్తున్నాము. మీ ఈ నిరీక్షణకు ఖచ్చితంగా తగిన ఫలితం లభిస్తుంది. హారర్ సినిమాలను చూసి నవ్వడం చాలు, ఇక అసలైన భయాన్ని అనుభవిస్తూ భయపడాల్సిన సమయం వచ్చింది" అని రాసుకొచ్చారు. సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నోట్ వైరల్‌గా మారింది.






